రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనేదే లక్ష్యం

SKLM: బూర్జ మండలం అల్లెన గ్రామంలో రైతులకు మంగళవారం సబ్సిడీ ద్వారా నూతన వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసినట్లు మండల టీడీపీ అధ్యక్షులు వావిలాపల్లి రాంజీ తెలిపారు. రైతులు అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా ఎదగాలన్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు.