నేరేడుచర్లలో హిందూ ధర్మ శోభాయాత్ర
SRPT: నేరేడుచర్ల పట్టణంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు హిందూ సమ్మేళనం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేరేడుచర్ల పట్టణ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర చేపట్టగా, భక్తుల 'జై శ్రీరామ్' నినాదాలతో పురవీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వెంకటరెడ్డి, పలువురు ప్రముఖులు హిందూ ధర్మ పరిరక్షణ ప్రాధాన్యతను చాటిచెప్పారు.