మోదీపై రాహుల్ విమర్శలు

మోదీపై రాహుల్ విమర్శలు

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఇతర చోట్ల మతం, దేవుడి గురించి మాట్లాడే మోదీ కేరళంలో మాత్రం ఆ విషయాలను ఎందుకు ప్రస్తావించరని ప్రశ్నించారు. శబరిమల ఆలయంలో జరిగిన బంగారు తాపడాల స్కాం గురించి ఇప్పటివరకు ఆయన ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. బంగారు తాపడాలు మాయమవడం వెనక సీపీఐ నేతల హస్తం ఉందని ఆరోపించారు. అందుకే బీజేపీ మౌనంగా ఉందని తెలిపారు.