ఇఫ్తార్ విందుకు హాజరైన కలెక్టర్, ఎమ్మెల్యే
GDWL: పట్టణంలోని నల్లకుంట ఉర్దూ భవన్‌లో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం నేతలు వారికి పుష్పగుచ్చాలు అందజేసి సన్మానించారు. ప్రత్యేక ప్రార్థన నిర్వహించి పండ్లు తినిపించారు.