'మహాత్మా బసవేశ్వర బోధనలు నేటికీ ఆదర్శనీయం'

'మహాత్మా బసవేశ్వర బోధనలు నేటికీ ఆదర్శనీయం'

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం మహాత్మా బసవేశ్వర జయంతిని నిర్వహించారు. కలెక్టర్ హరిత బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. మూఢనమ్మకాలు ప్రబలిన కాలంలో ప్రజలను చైతన్య పరిచిన మహనీయుడు బసవేశ్వరుడని కొనియాడారు. కుల, వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి, సమానత్వాన్ని ప్రబోధించిన ఆయన బోధనలు నేటికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు.