మంత్రి స్పందించిన తీరు ఆదర్శప్రాయం: ఎమ్మెల్యే

ELR: ఏలూరు క్యాంపు కార్యాలయంలో MLA బడేటి చంటి గురువారం మాట్లాడారు. నేపాల్లో అల్లరుల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించిన తీరు ఆదర్శప్రాయమని కొనియాడారు. అసలు భాషాభిమానం, ప్రాంతీయ అభిమానం ఉన్న పార్టీ ఒక్క TDP యేనని స్పష్టం చేశారు. 215 మందిని స్వస్థలాలకు చేర్చడంలో ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు.