VIDEO: అకాల వర్షాలతో పంటలకు భారీ నష్టం

VIDEO: అకాల వర్షాలతో పంటలకు భారీ నష్టం

KMR: జిల్లాలో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న, జొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భిక్కనూరు మండలంలో రాళ్ల వర్షంతో ధాన్యం నేలరాలగా, సదాశివనగర్ మండలంలో ఈదురుగాలులకు వందల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు ఒరిగాయి. రామేశ్వర్ పల్లిలో పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి చెందాయి.