'అహింసావాది కోసం హింసా వాదం వద్దు'
HYD: బాపూఘాట్లో మూసీ నది ఒడ్డున ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు కోసం లంగర్‌హౌస్, బండ్లగూడ పరిధిలో 450కిపైగా ఇళ్లను కూల్చి వేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై కొంతమంది మేదావులు స్పందిస్తూ.. అహింసావాదైన గాంధీ కోసం పేద ప్రజల ఇండ్లను కూల్చి హింసా వాదానికి దిగొద్దని సూచిస్తున్నారు.