పొదలకూరులో వాహనాల తనిఖీలు
NLR: పొదలకూరులోని సంగం రోడ్డు కూడలిలో ఆదివారం రాత్రి ఎస్సై షేక్. మహమ్మద్ హనీఫ్ వాహనాల తనిఖీ చేపట్టారు. వాహన చోదకులు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని, ఇతర వాహనదారులు సీట్ బెల్టులు పెట్టుకోవాలని సూచించారు. ఆటోలలో అధిక ప్యాసింజర్లని ఎక్కిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.