కోచ్ గంభీర్‌పై అఫ్రిది తీవ్ర విమర్శలు
టీమిండియా కోచ్ గంభీర్‌పై పాక్ మాజీ కెప్టెన్ అఫ్రిదీ తీవ్ర విమర్శలు చేశాడు. గంభీర్ తీసుకున్న చెత్త నిర్ణయాల కారణంగానే SAతో టెస్టు సిరీస్‌ను భారత్ కోల్పోయిందని అఫ్రిదీ పేర్కొన్నాడు. జట్టులో తరచుగా మార్పులు చేస్తూ ప్రయోగాలు చేయడం వల్ల మొదటికే మోసం వస్తుందని హెచ్చరించాడు. 'రో-కో' సేవలను పెద్ద టోర్నీల్లో వినియోగించుకొని, చిన్న జట్లపై వారికి విశ్రాంతినివ్వాలన్నాడు.