పిడతాపోలూరులో సోమిరెడ్డి ప్రజాదర్బార్
NLR: ముత్తుకూరు మండల పర్యటన సందర్భంగా పిడతాపోలూరులో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రతి సమస్యను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే పలు మండలాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించామని తెలిపారు.