పొన్నూరులో ప్లాస్టిక్ తనిఖీలు

పొన్నూరులో ప్లాస్టిక్ తనిఖీలు

GNTR: పొన్నూరు పట్టణంలో మంగళవారం అధికారులు అకస్మాత్తుగా దుకాణాల తనిఖీలు చేపట్టారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని వ్యాపారులపై రూ.5 వేల జరిమానా విధించారు. ఇకపై కూడా ప్లాస్టిక్ అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.