గాంధీనగర్ పాఠశాల సందర్శించిన డీఈవో
MDK: మెదక్ పట్టణ గాంధీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను డీఈవో విజయ సందర్శించారు. తరగతి గది బోధనా అభ్యసన ప్రక్రియను గమనించారు. మిడ్ లైన్ పరీక్ష నిర్వహణను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలను చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.