అవార్డు రావడం అభినందనీయం

MNCL: తాండూర్ మండలంలో విద్యా భారతి పాఠశాలకు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ రావడం అభినందనీయమని మాజీ విద్యార్థి సంఘాల నాయకులు దుర్గం రవీందర్, కృష్ణదేవరాయలు, చంద్రశేఖర్, సతీష్, రహీం అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విద్యా భారతి పాఠశాల కరస్పాండెంట్ శరత్ కుమార్‌ను శాలువతో సన్మానించి అభినందించారు. వినూత్న పద్దతిలో బోధనకు గాను అవార్డు వచ్చిందన్నారు.