యూరియా కోసం బారులు తీరిన రైతులు

NLG: జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. శుక్రవారం పీఏ పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో అది సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. సరిపడా యూరియా సరఫరా చేసి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.