దుకాణాల్లోకి దూసుకెళ్లిన కారు
NLR: దుత్తలూరు మండలం, నందిపాడు సెంటర్లో సోమవారం వేగంగా వచ్చిన కారు నాలుగు దుకాణాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుకాణాల్లోని వస్తువులు చెల్లాచెదురు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.