భూపాలపల్లి మండల నూతన MROగా లక్ష్మీ రాజయ్య
BHPL: భూపాలపల్లి మండల నూతన తహసీల్దార్ (MRO)గా లక్ష్మీ రాజయ్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జిల్లాలో జరిగిన తహసీల్దార్ బదిలీలో భాగంగా గోరికొత్తపల్లి మండల కేంద్రంలో MROగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీ రాజయ్యను భూపాలపల్లి మండలానికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది లక్ష్మి రాజయ్యకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.