‘సాగునీటి భద్రత మనందరి బాధ్యత’
SKLM: సాగునీటి భద్రత మనందరి బాధ్యతని వంశధార డిపార్ట్‌మెంట్ ఏఈ టీ.కృష్ణారావు పేర్కొన్నారు. వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామంలో చాకలి చెరువును ఇవాళ పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీటిభద్రత సాగునీటిసంఘాల బాధ్యత అంశంపై ఎమ్మెల్యే శిరీష ఆదేశాల మేరకు పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. రైతులకు ఉపయోగపడే త్రాగునీటిని వృధా చేయరాదన్నారు.