'టెండర్ కోసం అనుమతి తప్పనిసరి'

HYD: గ్రేటర్ హైదరాబాద్‌లో పలు చోట్ల పనులు చేపట్టేందుకు టెండర్లు పిలవడం సాధారణం. అడిషనల్, జోనల్ కమిషనర్లు మాత్రం టెండర్లకు సంబంధించి సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదు. గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టాండింగ్ కమిటీ అనుమతి తీసుకున్న తరువాతే అభివృద్ధి పనులపై టెండర్లు ఆహ్వానించాలని మేయర్, కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అన్నారు.