సివిల్ సర్వీసెస్ ర్యాంకర్‌ని అభినందించిన ఎస్పీ
SKLM: సివిల్ సర్వీసెస్ పరీక్షలో 463వ ర్యాంక్ సాధించి విశేష ప్రతిభ కనబరిచిన నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రామును ఎస్పీ మహేశ్వర రెడ్డి బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సత్కరించి అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెంది, సాధారణ కుటుంబం నుండి వచ్చిన రాము సివిల్ సర్వీసెస్‌లో ఉన్నత ర్యాంక్ సాధించడం జిల్లాకు గర్వకారణమని అన్నారు.