బాధితులకు అండగా సీఎం సహాయనిధి
కృష్ణా: పెడన మండల టీడీపీ కార్యలయంలో బుధవారం సాయంత్రం 24 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహయ నిధి కింద రూ. 29,84,869 విలువైన చెక్కులను ఎమ్మెల్యే కాగితపు కృష్ణా ప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదవారికి ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరమని అన్నారు.