మహాశివరాత్రి జాతరకు ఉత్సవ కమిటీ ఏర్పాటు

SRCL: వేములవాడ శ్రీ రాజరాజశ్వర స్వామివారి దేవస్థానంలో ఈనెల 25 నుండి 27వరకు జరిగే మహా శివరాత్రి జాతర వేడుకల ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 29మంది సభ్యులతో కూడిన ఉత్సవ కమిటీ, ఈ నెల 23 నుండి 28 వరకు కమిటీ సభ్యుల పదవీ కాలం ఉంటుదని చెప్పారు.