నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై
SRPT: రాజకీయ ముసుగులో అలజడులు, అరాచకాలు సృష్టిస్తే కటకటాలు తప్పవని మద్దిరాల ఎస్సై వీరన్న అన్నారు. ఈరోజు మద్దిరాల మండల కేంద్రంలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. మండలంలో మొత్తం నామినేషన్ సెంటర్లల్లో వాతావరణం ప్రశాంతంగా ఉందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్సై పేర్కొన్నారు.