ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలి: కలెక్టర్
PDPL: వేసవికాలం దృష్ట్యా ప్రజలు సరైన జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ శ్రీ హర్ష సూచించారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకూడదని తెలిపారు. తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచాలని, మితంగా ఆహారం తీసుకోవాలని సూచించారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని తెలిపారు.