ఏడు ఇసుక లారీల పట్టివేత
NLG: ఏపీలోని పల్నాడు జిల్లా నుంచి రాష్ట్రంలోకి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 7లారీలను వాడపల్లి పోలీసులు పట్టుకున్నారు. SI శ్రీకాంత్ వివరాల ప్రకారం.. స్థానికంగా ఇసుకకు డిమాండ్ ఉండటంతో ఇసుకను AP నుంచి ఇక్కడికి రవాణా చేస్తున్నారు. అక్కడ టన్ను ఇసుక ధర రూ.1,000 లోపు ఉండటంతో లారీల ద్వారా మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో దిగుమతి చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు.