VIDEO: భూపాలపల్లి డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింపు
జయశంకర్ భూపాలపల్లి బస్ డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగింది. సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు నల్ల రిబ్బన్స్ ధరించి డిపో ముందు ధర్నా చేపట్టారు. మృతి చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్‌కు మౌనంగా నివాళులు అర్పించారు. ఆయన మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. జేఏసీతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలన్నారు.