ఎర్రచెరువు గండి పరిశీలించిన ఎమ్మెల్యే

ఎర్రచెరువు గండి పరిశీలించిన ఎమ్మెల్యే

NTR: జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామంలోని ఎర్రచెరువుకు పడిన గండిని మైలవరం MLA వసంత కృష్ణప్రసాద్ బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దీనికి పడిన గండిని శాశ్వత ప్రాతిపదికన పూడ్చివేసి మరమ్మతులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.