బస్సు టైరు కింద పడి యువకుడు మృతి
NLR: వింజమూరు బంగ్లా సెంటర్ కూడలి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న యువకుడు ప్రమాదవశాత్తు అదుపుతప్పి కింద పడిపోగా, వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు టైరు అతనిపైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని ఆత్మకూరు మండలం రాజవోలుకు చెందిన సురేంద్ర (27)గా ఆధార్ కార్డు ద్వారా గుర్తించారు.