నేడు అమెరికాకు మంత్రి లోకేష్
AP: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి లోకేష్ ఇవాళ్టి నుంచి 10వ తేదీ వరకు అమెరికా, కెనడాలో పర్యటించనున్నారు. తొలిరోజు డల్లాస్‌లోని తెలుగువారిని కలుస్తారు. 8, 9వ తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. 10న టొరెంటోలో పర్యటిస్తారు. 18 నెలల్లో లోకేష్ అమెరికా వెళ్లడం రెండోసారి. ఇప్పటివరకు US, దావోస్, సింగపూర్ ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు.