అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం
అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీరామనవమి సందర్భంగా సరయూ నదిలోని జమ్తారా ఘాట్ వద్ద ఉన్న యజ్ఞశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో మంత్రి దయాశంకర్ సహా పలువురు ఉన్నతాధికారులు అక్కడే ఉన్నప్పటికీ వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం నిర్వహించిన మరుసటి రోజే ఈ ప్రమాదం జరగటం గమనార్హం. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.