నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
ఏలూరు అశోక్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ అంబేద్కర్ తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎన్ఆర్ పేట, పోలీస్ క్వార్టర్స్, కొత్త బస్టాండ్, అమీనాపేట, పత్తేబాద్, రైతుబజార్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.