NCC క్యాడెట్లకు CPR ట్రైనింగ్
MDCL: మల్కాజిగిరి, బొల్లారంలో NCC క్యాడెట్లకు CPR శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే విధానాలపై ప్రాయోగిక అవగాహన కల్పించారు. హృదయాఘాతం, ప్రమాదాల సమయంలో CPR ప్రాముఖ్యతను నిపుణులు వివరించగా, క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. డా.శిల్ప CPR గూర్చి వివరిస్తూనే, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశంగా తెలిపారు.