365 సర్పంచ్, 1535 వార్డ్ స్థానాలకు నామినేషన్‌లు దాఖలు

365 సర్పంచ్, 1535 వార్డ్ స్థానాలకు నామినేషన్‌లు దాఖలు

ASF: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3వ విడత నామినేషన్స్‌లో 4 మండలాల్లోని 108 గ్రామపంచాయతీలకు 365 సర్పంచ్ నామినేషన్‌లు దాఖలయ్యాయి. ఆసిఫాబాద్-65, తిర్యాణి-89, రెబ్బెన-96, కాగజ్ నగర్ -115 చొప్పున పత్రాలు సమర్పించారు. మొత్తం 938 వార్డు స్థానాలకు 1535 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 11న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.