నేలకొరిగిన వందేళ్ల నాటి భారీ వృక్షం
గుంటూరు జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న వందేళ్ల భారీ వృక్షం శుక్రవారం అర్ధరాత్రి కూలిపోయింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న మరో చెట్టు, నాలుగు విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడ్డాయి. చెట్టు విద్యుత్ తీగలపై పడటంతో స్తంభాలు మధ్యకు విరిగిపోయి రోడ్డుపై పడ్డాయి. అర్ధరాత్రి కావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. శనివారం దానిని సిబ్బంది తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.