VIDEO: ఏలూరులో అంగన్వాడీలు భారీ ర్యాలీ
ఏలూరు నగరంలో మంగళవారం అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేతనాలు పెంచాలని కోరుతూ నిరసన ర్యాలీ చేశారు. అలాగే ధర్నా చేస్తున్న అంగన్వాడీలపై దమనకాండను ఖండిస్తూ నినాదాలు చేశారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.