‘సాయుధ పోరాటయోధుడు అనభేరి’

KNR: కామ్రేడ్ అనభేరి ప్రభాకర్ రావు 115వ జయంతిని ఆయన స్వగ్రామమైన పొలంపల్లిలో ఘనంగా నిర్వహించారు. సీపీఐ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. మండల కార్యదర్శి బోయిని తిరుపతి మాట్లాడుతూ.. భూమికోసం వెట్టి చాకిరి విముక్తి కోసం రజాకర్ల నుంచి పేదలకు విముక్తి కల్పించిన గొప్ప నాయకుడని కొనియాడారు.