బాలుడి మిస్సింగ్.. ఛేదించిన పోలీసులు
KKD: తుని సీతారాంపురంలో శనివారం తప్పిపోయిన పునీత్ రాజ్ (10) అనే బాలుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించి తల్లికి అప్పగించారు. ఉదయం ఇంటి వద్ద ఆడుకుంటూ బాలుడు కనిపించకుండా పోవడంతో తల్లి తుని టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. CI గీతా రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలించి బాలుడిని సురక్షితంగా చేరవేశారు.