లష్కరే తొయిబాకు చెందిన ఐదుగురు అరెస్ట్
జమ్మూకశ్మీర్‌లో లష్కరే తొయిబా ముఠాను శ్రీనగర్ పోలీసులు పట్టుకున్నారు. అంతర్రాష్ట్ర LET ముఠాకు చెందిన ఐదుగురుని అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో పాక్ ఉగ్రవాది అబ్దుల్లా అలియాస్ అబు హురైరా కూడా ఉన్నట్లు గుర్తించారు. 16 ఏళ్లుగా పరీరాలో ఉన్న హురైరాను ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో పాక్ ఉగ్రవాది ఉస్మాన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.