కృష్ణా తరంగ్ 2025ను ప్రారంభించిన వెంకయ్య నాయుడు
కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృష్ణా తరంగ్ 2025 మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్య క్రమం మొదలుపెట్టారు. అనంతరం ఎన్.సీ.సీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్య క్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఉపకులపతి ఆచార్య రాంజీ పాల్గొన్నారు.