పరిసరాలను శుభ్రం చేసిన కలెక్టర్
కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ పరిసరాల పరిశుభ్రత చేపట్టారు. కలెక్టర్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలోని చెత్తను తొలగించి శుభ్రం పరిచారు. ఈ మేరకు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.