గొర్రెలు, మేకలకు ముతి వాపు నివారణ టీకాలు

NGKL: వర్షాకాలంలో గొర్రె, మేకలకు మూతి వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున కాపరులు ముందస్తు చర్యలో భాగంగా ప్రతి గొర్రెలకు, మేకలకు టీకాలు వేయాలని మండల పశువైద్యాధికారి అనిల్ తెలిపారు. గురువారం బల్మూరు మండలం జినుకుంట, గట్టుతుమ్మన్ గ్రామాలలో గొర్రెలకు మేకలకు మూతి వాపు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ పి కిషోర్ పాల్గొన్నారు. గొర్రెల, మేకల పట్ల జాగ్రత్తలు వహించాలని తెలిపారు.