VIDEO: అధ్వానంగా అంగన్వాడీ కేంద్రం

VIDEO: అధ్వానంగా అంగన్వాడీ కేంద్రం

ప్రకాశం: దర్శిలోని శివనగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మురికి కూపంలా మారాయి. దీంతో చంటి బిడ్డలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు కేంద్రం పక్కనే డంపింగ్ యార్డు వద్ద చెత్తాచెదారం వేస్తుండటంతో వ్యాధులు వస్తాయని గర్భిణిలు, బాలింతలు భయపడి కేంద్రానికి రావటం లేదని స్థానికులు తెలిపారు.