ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ
NLG: దామరచర్ల(M) ఉపాధి హామీ పథకం 2024-25 సంవత్సరానికి సంబంధించి 239 పనులకు సోషల్ ఆడిట్ బృందం గత 15 రోజులుగా ఆడిట్ నిర్వహించింది. బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వేదికలో చిన్న పొరపాట్లకు టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రెటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లపై రూ. 20 వేల పెనాల్టీ రూ. 1,01,797 రికవరీని నిర్ధారించారు.