‘ఓటమి జీవితానికి ముగింపు కాదు’
TG: ఇంటర్ పరీక్షల ఫలితాల నేపథ్యంలో 8 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడంపై సీపీ వీసీ.సజ్జనార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఓటమి జీవితానికి ముగింపు కాదని, గెలుపనకు ఒక పాఠం మాత్రమేనని హితవు పలికారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోయినట్లు కాదని, ధైర్యంగా నిలబడటమే అసలైన విజయమన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు కొండంత భరోసానిచ్చి నిండు ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.