ఆరోజు సత్యసాయి నాకు ఫోన్ చేశారు: సచిన్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 2011లో తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడాడు. సత్యసాయి బాబా శత జయంతి వేడుకల కోసం ఏపీలోని పుట్టపర్తికి వచ్చిన సచిన్.. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తనకు బాబా స్వయంగా ఫోన్ చేసి తనకోసం ఓ పుస్తకం పంపినట్లు చెప్పారని.. బాబా మాటలు ఆయన పంపిన పుస్తకం తనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయని వెల్లడించాడు.