అయ్యప్ప స్వామికి వెండి గొడుగు
KDP: పులివెందులలోని శ్రీ మిట్టమల్లేశ్వర స్వామి దేవస్థానంలో వెలసిన అయ్యప్ప స్వామికి మేడా ఈశ్వరయ్య దంపతులు వెండి గొడుగును బహుకరించారు. రూ.4.50 లక్షలు విలువ చేసే 3 కేజీల వెండి గొడుగును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కుటుంబ సభ్యులతో గ్రామోత్సవంగా ఆలయానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రుద్రమూర్తి, గురుస్వాములు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.