'ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలి'
VZM: కూటమి ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని ఆపాలని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలు మేరకు VZMలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పలు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ తీశారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు.