రష్యాకు రావాలని ప్రధాని మోదీకి పిలుపు

రష్యాకు రావాలని ప్రధాని మోదీకి పిలుపు

ఈ ఏడాది తమ దేశానికి రావాలని ప్రధాని మోదీకి రష్యా ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానం పంపింది. రష్యన్ రాయబారి ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఉన్నత స్థాయి చర్చల కోసం దౌత్యపరమైన కసరత్తు జరుగుతోందని తెలిపారు. భారత్-రష్యా మధ్య వ్యూహాత్మక, ఆర్థిక బంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ పర్యటన జరగనుంది. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ స్నేహానికి ఈ భేటీ ఓ మైలురాయిగా నిలవనుంది.