లబ్ధిదారులుకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
KMM: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మంలో బుధవారం 27 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని భరోసా ఇచ్చారు.