వైసీపీ నేత ఇంటి ముందు గ్రామస్తుల ధర్నా

ELR: ఏలూరులో వైసీపీ నేత మోరు రామరాజు ఇంటిని పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామస్తులు సోమవారం ముట్టడించి, ధర్నా చేశారు. తమ గ్రామానికి ఇవ్వాల్సిన రూ.57.12 లక్షలు ఇవ్వకుండా రామరాజు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తమ డబ్బులు అడిగితే గ్రామ పెద్దలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు.